– పులిచర్లలో బహుమతులు అందజేస్తున్న వినయ్ రెడ్డి
నవతెలంగాణ -పెద్దవూర: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పులిచర్ల గ్రామంలో సంక్రాతి సందర్బంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం గత రెండు రోజులుగా యువతకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. సోమవారం కాంగ్రెస్ జిల్లా యువజన నాయకులు గడ్డంపల్లి వినయ్ రెడ్డి, గార్లపాటి శ్రీనివాస్ రెడ్డి కబడ్డీ పోటీలు ఏర్పాటు చేసి విజేతలగా నిలిచిన జట్టులకు బహుమతులు అందజేశారు.ఈసందర్బంగా మాట్లాడుతూ పట్టుదలతో, కృషితో రన్నర్ విన్నర్ గా మూడు, నాలుగవ స్థానాలుగా నిలిచిన జట్టలకు ముందుగా అభినందనలు తెలిపారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని అలవార్చుకోవాలని అన్నారు. ఫైనల్ విజయం సాధించిన జట్టుకు బహుమతులు అందజేశారు.