
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రముఖ సీనియర్ న్యాయవాది లక్కినేని రామ భద్రయ్య మరణం ఈ ప్రాంత ప్రజానీకానికి,న్యాయవాదులకు తీరని లోటు అని స్థానిక యువ న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేసారు. సత్తుపల్లి, కొత్తగూడెం, ఖమ్మం కోర్టులలో ఆయన సుదీర్ఘకాలం న్యాయవాదిగా మరియు సత్తుపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా సుదీర్ఘ కాలం పని చేసిన ఆయన గురువారం హైద్రాబాద్ లో మృతి చెందారు. ఆయన మృతి వార్త తెలిసిన అశ్వారావుపేట న్యాయవాదులు సంతాపం ప్రకటించారు. అనంతరం వారు విలేఖర్లతో మాట్లాడుతూ.. ఆయన 85 సంవత్సరాల లో 60 సంవత్సరాలు న్యాయవాది వృత్తిలో ఉండి అనేక రకాల వేలాది కేసులు వాదించారు అని అన్నారు.సివిల్,క్రిమినల్ కేసులు చేయడంలో గొప్ప నేర్పరి తనంతో పాటు నిజాయితీ గా వ్యవహరించే వారని గుర్తు చేసుకున్నారు. రామ భద్రయ్య దగ్గర ఎంతో మంది యువ లాయర్లు జూనియర్లు గా చేసి ప్రస్తుతం ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు.వారు లేని లోటుని న్యాయవాదులు జీర్ణించుకోలేక పోతున్నారని,ఆయన మృతి చాలా చాలా బాధాకరం అని విచారం వ్యక్తం చేసారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక న్యాయవాదులు లక్కినేని నరేంద్ర బాబు,ఉడత నేని శ్రీనివాసరావు,మడుపు వెంకటరమణ,మారం సతీష్, తుమ్మ రాంబాబు, సంజయ్, ముప్పిడి శ్యాం సుధాకర్, అరుణ ఉన్నారు.
