యువకులు క్రీడల్లో రాణించాలి బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు

యువకులు క్రీడల్లో రాణించాలి బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు– సీఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌
నవతెలంగాణ-తలకొండపల్లి
మండల పరిధిలోని వెల్జాల్‌ గ్రామంలో బుధవారం వీపీఎల్‌ 10 ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ విజయవంతంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు సీఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నిర్వహించే క్రీడ పోటీలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. క్రీడకారుల్లో ఉన్న నైపుణ్యానాన్ని వెలికితీసేందుకు ఇటువంటి క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో ఉప్ప సర్పంచ్‌ అజిజ్‌, ఆర్గనైజర్‌ అబ్బాస్‌, జిల్లా కోఆప్షన్‌ బుజ్జు బర్‌ రెహమాన్‌, పిఎస్‌ఎస్‌ వైస్‌ చైర్మన్‌ కున రవి, ఎంపీటీసీ అంబాజి, ప్రకాష్‌, శ్రీనివాస్‌, విష్ణువర్ధన్‌ యాదవ్‌, వానరసి వెంకటేష్‌, సాయికుమార్‌, అవినాష్‌, గోపాల్‌ కష్ణ, కయ్యుమ్‌, వార్డు సభ్యులు విజరు కుమార్‌, శ్రీరామ్‌, యాదయ్య, పెంటయ్య గౌడ్‌, నాయకులు, అరిఫ్‌, సుధాకర్‌, రాఘవేందర్‌, విజరు, శేఖర్‌, శ్రీను, రషీద్‌, శ్రీశైలం, రాము, లింగం, కష్ణ, సుల్తాన్‌ క్రీడాకారులు ,యువకులు తదితరులు పాల్గొన్నారు.