గణతంత్ర దినోత్సవ సందర్భంగా కామారెడ్డి జిల్లా సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆవరణలో 18 నుండి 26వ తేదీ వరకు సీనియర్ సిటిజన్స్ కు ఆటల పాటల పోటీలు నిర్వహించబడతాయని సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షులు పున్న రాజేశ్వర్ అన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఆటల పోటీలు కొనసాగుతాయని, శనివారం ఉదయం ఆటల పోటీలను ప్రారంభించారు. గెలుపొందిన వారికి గణతంత్ర దినోత్సవ నా బహుమతులు ప్రధానం చేయబడునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రాజన్న, కోశాధికారి జైహింద్, ఆటల బాధ్యులు డాక్టర్ పివి నరసింహo, ఎం మోహన్ రెడ్డి, పి విశ్వనాథం, , పురుషోత్తం, పి అశోక్ రావు, అశోక్ కుమార్, సిద్ధ రాములు, యోగా అంజయ్య, వి చంద్రకాంతం తదితరులు పాల్గొన్నారు.