నవతెలంగాణ – నెల్లికుదురు
నూతనంగా ఎమ్మెల్సీగా ఎంపికైన మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా నూతనంగా ఎంపీక అయినా సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపి ఆయనకు హర్ష వ్యక్తం ప్రకటించినట్లు తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీ పదవి రావడానికి సహాకరించిన పెద్దలకు రుణపడి ఉంటామని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే పేదలందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. వారితో పాటు సట్ల యాకయ్య, గారె జోసఫ్ పాల్గొన్నారు.