హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు మతుకుమల్లి కోదండ రాం ప్రసాద్ (68) శనివారం ఉదయం గుండెపోటుతో మరణిం చారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడు తున్న రాంప్రసాద్ శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. రాంప్రసాద్ స్వగ్రామం కృష్ణా జిల్లా చల్లపల్లి. మొదట ఆంధ్ర పత్రికలో సబ్ ఎడిటర్‌గా పని చేశారు. 1991 ఏప్రిల్‌లో ప్రజాశక్తిలో చేరారు. అప్పటి నుంచి 2013లో రిటైరయ్యేవరకు ప్రజాశక్తిలో జనరల్ డెస్కు, స్పోర్టు, ఎడిట్ పేజీ డెస్కుల్లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేశారు. 1999లో ప్రజాశక్తి ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌కు మారినప్పుడు అందరితోబాటు ఆయన కూడా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కుటుంబాన్ని షిప్టు చేశారు. రాంప్రసాద్ మృతికి ప్రజాశక్తి సంపాదకులు బి తులసీదాస్, చీఫ్ జనరల్ మేనేజరు వై అచ్యుత రావు ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. నవతెలంగాణ ఎడిటర్ సుధాభాస్కర్, చీఫ్ జనరల్ మేనేజర్ పి ప్రభాకర్ సంతాపం ప్రకటించారు.