సీనియర్‌ కరాటే మాస్టర్‌ సంఘయ్యకు పూర్వ విద్యార్థుల ఘన సన్మానం

నవతెలంగాణ-మర్పల్లి
ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వికా రాబాద్‌ జిల్లా కేంద్రంలో జిల్లా ఉత్తమ కరాటే కోచ్‌గా సీని యర్‌ కరాటే మాస్టర్‌ సంఘయ్య ఎంపికయ్యారు. ఈ సం దర్భంగా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా పరి షత్‌ చైర్మన్‌ సునీతా మహేందర్‌ రెడ్డి చేతుల మీదుగా అవా ర్డును సంఘయ్య అందుకున్నారు. మండల కేంద్రంలోని మార్కెట్‌ కార్యాలయం ఆవరణలో ఆయన వద్ద కరాటే శిక్ష ణ పొందిన పూర్వ విద్యార్థులు ఆదివారం శాలువా పూల మాలతో సంఘయ్యను సత్కరించారు. కే పాండు, అశోక్‌ లు మాట్లాడుతూ.. సంగయ్య మాస్టర్‌ ఎంతో క్రమశిక్షణతో విద్యా ర్థులకు కరాటే శిక్షణ ఇచ్చేవారని ఆయన దగ్గర శిక్షణ పొందిన ఎంతోమంది బ్లాక్‌ బెల్ట్‌ సాధించారని వారన్నా రు. కొంతమంది పేద విద్యార్థులు డబ్బులు ఇవ్వకున్నా ఆయన ఉచితంగా శిక్షణ ఇచ్చేవారని మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో చుట్టుపక్కల మండలాల్లో సైకిల్‌ పై వెళ్లి వందలాది మంది విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇచ్చారని తెలిపారు. మాస్టర్‌ సింగూరి సంగయ్య బ్లాక్‌ బెల్ట్‌ ఫోర్త్‌ డాన్‌ మాట్లాడుతూ.. 32 ఏండ్లుగా యువకులకు కరాటే శిక్షణ ఇస్తున్నానని, బాల బాలికలకు ఉచితంగా కరాటే శిక్షణా తరగతులు కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతి గృహాల్లో విద్యార్థులకు శిక్షణా తరగతులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. కార్యక్ర మంలో వైస్‌ ఎంపీపీ మోహన్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ టౌన్‌ ప్రెసి డెంట్‌ గఫార్‌, మండల యూత్‌ అధ్యక్షుడు మధుకర్‌, నాగ రాజు, నర్సింలు, మధు, మధుకర్‌, నర్సింలు, వసంత్‌ కు మార్‌ తదితరు లున్నారు.