
భువనగిరి జిల్లా కోర్టు లో సీనియర్ న్యాయవాది గతంలో ప్రభుత్వ న్యాయవాది గా పని చేసిన ఆకుల ఆంజనేయులు అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు . గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాది తో అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు. భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన మృతి పట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగారం అంజయ్య తో పాటు పలువురు న్యాయవాదులు పడాల శ్రీనివాస్, మామిడి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. పలు రాజకీయ పార్టీల నాయకులు, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొండమడుగు నరసింహ,బీజేపీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్, గ్రంథాలయ సంస్థల మాజీ జిల్లా చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్ గౌడ్, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు కొలుపుల అమరేందర్, వైఎల్ఎన్ఎస్ బ్యాంక్ వైస్ చైర్మన్ కొలుపుల వివేకానంద ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తపరిచారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.