అనాథ పిల్లలకు రూ.3 లక్షలు అందజేసిన సీనియర్ లీగల్ జడ్జి పద్మావతి..

నవతెలంగాణ – డిచ్ పల్లి 
జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ  నిజామాబాద్ ఆధ్వర్యంలో సీనియర్ లీగల్ జడ్జి పద్మావతి చేతుల మీదుగా ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి  సిర్నాపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబ అనాధ పిల్లలకి 3 లక్షల రూపాయలు ను సోమవారం అందజేసినట్లు సంస్థాన్ సిర్నపల్లి  మాజీ సర్పంచ్ తేలు విజయ్ కుమార్ తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం గతంలో భార్య, భర్తను చంపి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న నిందితురాల్ల పిల్లలు అనాథలు గా మారారు. అపిల్లలకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ నిజామాబాద్ వారి నిధుల నుండి ఈ పిల్లల బావిష్యత్తుకోసం ఉపయోగ పడే విధంగా రూ.3 లక్షలు అందించినట్లు వివరించారు.పిల్లలకు రాబోవు రోజుల్లో ఇబ్బందులు కలగకుండా లీగల్ సర్వీసెస్ అథారిటీ నిజామాబాద్ 3లక్షలు ఇవ్వడం చాలా గర్వకారణమని లీగల్ సర్వీసెస్ అథారిటీ నిజామాబాద్ కు కుటుంబం తరపున సిర్నాపల్లి గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో  డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యులు, సూపరింటెండెంట్  పురుషోత్తం,  రిటైర్డ్ ఎఎస్ఐ జీవన్ రావ్, సిర్నాపల్లి మాజీ సర్పంచ్ తెలు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు‌.