తెలంగాణలో సీనియర్‌ జాతీయ త్రోబాల్‌ చాంపియన్‌షిప్‌

– నేషనల్‌ గేమ్స్‌ ఆర్గనైజింగ్‌ చైర్మెన్‌ సత్యం శ్రీరంగం
నవతెలంగాణ-బాలానగర్‌
జాతీయ త్రోబాల్‌ చాంపియన్‌ షిప్‌ 2024 -25 ఈవెంట్‌ను నిర్వహించేందుకు తెలంగాణకు అవకాశం కల్పించిన, త్రోబాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగంకు అసోసియేషన్‌ వారు కతజ్ఞతలు తెలిపారు. సోమవారం సోమాజి గూడ ప్రెస్‌ క్లబ్‌లో 47 వ సీనియర్‌ నేషనల్‌ త్రోబాల్‌ ఛాంపియన్‌ షిప్‌ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ మేరకు త్రోబాల్‌ చైర్మెన్‌ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌ రావు, చీఫ్‌ ప్యాట్రన్‌ అమీర్‌ అలీ ఖాన్‌, తెలంగాణ త్రోబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, నేషనల్‌ గేమ్స్‌ ఆర్గనైజింగ్‌ చైర్మెన్‌ టీపీసీసీ అధికార ప్రతినిధి డా.సత్యం శ్రీరంగం, కోశాధికారి జమీల్‌, జనరల్‌ సెక్రటరీ కష్ణారెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ కష్ణ రాజ్‌పుత్‌, చిత్ర షెనోరు, జాయింట్‌ సెక్రటరీ సిహెచ్‌. శ్రీనివాస్‌ తదితరులు పాల్గొ న్నారు. ఈ సందర్బంగా అధ్యక్షులు సత్యం శ్రీరంగం మాట్లాడుతూ 47 వ సీనియర్‌ నేషనల్‌ త్రోబాల్‌ ఛాంపియన్‌షిప్‌ జూన్‌ 6 నుంచి జూన్‌ 8, 2024 వరకు హైదరాబాద్‌లో గొప్ప ఈవెంట్‌ను నిర్వహించేందుకు తెలంగాణకు అవకాశం కల్పించిన త్రోబాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు మా హదయ పూర్వక కతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌కు సన్నాహకంగా ఎంపిక బందం తెలంగాణ త్రోబాల్‌ జట్టును మే 25, 2024న ఉదయం 10 గంటల నుంచి హయత్‌నగర్‌లోని వర్డ్‌ అండ్‌ డీడ్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీలో ఎంపిక చేస్తుందని, ఆసక్తిగల క్రీడాకారులు రావాలని సూచించారు. ఈ ఛాంపియన్‌ షిప్‌ను స్మారక విజయంగా పాల్గొనే వారికి ప్రేక్షకులం దరికీ మరపురాని అనుభూతిని అందించాలని తెలిపారు.