అనారోగ్యంతో సీనియర్ గ్రామీణ వైద్యుడు కిషన్ రాజు మృతి

– పలువురు సంతాపం
నవతెలంగాణ-మల్హర్ రావు : మండలంలోని కొయ్యుర్ గ్రామానికి చెందిన సీనియర్ గ్రామీణ వైద్యుడు,మనం దినపత్రిక మండల జర్నలిస్ట్ ఎర్రం కిషన్ రాజు (59) అనారోగ్యంతో హైదరాబాద్ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.కిషన్ రాజు 30 సంవత్సరాలుగా మండలంలోని పలు గ్రామాలకు వైద్య సేవలు అందిస్తున్నాడు.ఆయన ఆకాల మరణం చాలా బాధాకరమని పలువురు సంతాపం వ్యక్తం చేశారు.కిషన్ రాజు ఆకాల మృతి ఇటు వైద్య వృత్తికి, అటు జర్నలిస్ట్ వృత్తికి తీరని లోటని మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, టియూడబ్ల్యూజె (ఐజెయు) జిల్లా కోశాధికారి, తెలంగాణ ఆర్ఎంపీ,పిఎంపి వెల్పేర్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్,కొయ్యుర్ సర్పంచ్ సిద్ది లింగమూర్తి,ఆయన ఆత్మకు శాoతి చేకూరాలని,ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.