‘పది’ ఫలితాల్లో నారాయణ విద్యార్థుల సంచలనం

నవతెలంగాణ – జగద్గిరిగుట్ట
పదో తరగతి పరీక్ష ఫలితాలలో తమ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచి సంచలనం సష్టించారని నారాయణ పాఠశాల చింతల్‌ బ్రాంచ్‌ ఏజీఎం వైజయంతి అన్నారు. గురువారం పాఠశాల క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోఆర్డినేటర్‌ శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్‌ స్వరాజ్యలక్ష్మిలతో కలిసి వారు మాట్లాడారు. విద్యార్థుల కషి, పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు తమ అధ్యాపక బృందం అకుంటిత దీక్షతో బోధించినందువల్లనే మంచి ఫలితాలు సాధించగలిగామన్నారు. కుత్బుల్లాపూర్‌ మండలంలోనే తమ నారాయణ విద్యార్థులు ఫలితాలలో సత్తా చాటి తలమా నికంగా నిలిచారన్నారు. తాజా పదో తరగతి ఫలితాల్లో ఐదుగురు విద్యార్థులు సీజీపీఏ (10/10), 50 మందికి పైగా విద్యార్థులు సీజీపీఏ 9.0 తో ఉత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. అనంతరం అధ్యాపక బందం, సిబ్బంది పాఠశాల క్యాంపస్‌లో పుష్పగుచ్చాలు అందజేసి విద్యార్థులను అభినందించారు. పాఠశాల ప్రాంగణంలో బాణాసంచా కాలుస్తూ స్వీట్లు పంచుకున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫలితాలతో రాణిస్తూ ఉన్నతులుగా ఎదగాలని విద్యార్థులను ఆశీర్వదించారు.