80వేల ఎగువన సెన్సెక్స్‌

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో పరుగు కొనసాగుతోంది. సెన్సెక్స్‌ తొలిసారి 80వేల ఎగువన ముగిసి నూతన రికార్డ్‌ను సృష్టించింది. గురువారం కొనుగోళ్ల మద్దతుతో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 63 పాయింట్లు పెరిగి 80,050 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 16 పాయింట్లు లాభపడి 24,302కు చేరింది. రెండు సూచీలు చరిత్రలోనే ఆల్‌టైం గరిష్టాలను నమోదు చేశాయి. బిఎస్‌ఇలో దాదాపు 1,901 షేర్లు పెరగ్గా.. 1550 షేర్లు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. మరో 62 స్టాక్స్‌ యథాతథంగా నమోదయ్యాయి. నిఫ్టీలో అత్యధికంగా హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌ అధికంగా లాభపడ్డాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సూచీలు అధికంగా నష్టపోయిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు 0.6శాతం చొప్పున లాభపడ్డాయి.