ముంబయి : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తున్నారనే వార్తలతో దేశీయ స్టాక్ మార్కెట్లు కొనుగోళ్ల మద్దతుతో దూసుకుపోయాయి. బుధవారం బిఎస్‌ఇ సెన్సెక్స్ మళ్లీ 80 వేల మార్కును దాటింది. తుదకు 901.50 పాయింట్లు పెరిగి 80,378కు చేరింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 271 పాయింట్లు పెరిగి 24,484 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో టిసిఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్ షేర్లు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. టైటాన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. నిఫ్టీ ఐటి సూచీ దాదాపు నాలుగు శాతం మేర లాభపడింది.