నవతెలంగాణ – మోపాల్
ఈనె 24, 25 తేదీలలో నల్గొండ లోని ఎన్జీ మైదానంలో జరిగిన తొమ్మిదవ సెపక్ తక్రా రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్ బాల బాలికల టోర్నమెంట్లో జిల్లా జట్లు పథకాలు సాధించి రాష్ట్ర జట్టుకు జిల్లానుండి ఆరుగురు క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గాదరి సంజీవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ జూనియర్ బాలికల విభాగంలో పి,లాస్య ప్రియ, ఎం మన్విత, బి,లాస్య శ్రీ రిషిత ముగ్గురు ఎంపిక కాగా, జూనియర్ బాలికల విభాగంలో పి శ్రీజ, పి, శ్రీష్ట ఎంపిక కాగా, జూనియర్ బాలుర విభాగం లో బి, ఉదయ్ కుమార్ ఎంపికయ్యడు. ఎంపికయినా క్రీడాకారులు మార్చ్ 26 నుండి 30 వరకు కర్ణాటక లోని ధవనగిరి లో జరిగే ఛాంపెయిన్ షిప్ టోర్నమెంట్ లో పాల్గొంటారు. జిల్లా నుండి రాష్ట్ర జట్టు కు ఎంపికయినా క్రీడాకారులకు జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ అధ్యక్షులు కేశ వేణు,, ఉపాధ్యక్షులు,దీపిక, ల్యాబ్ గంగారెడ్డి, ఆర్గనైజషన్ సెక్రెటరీ చామ కూర భాగరెడ్డి, సంయుక్త కార్యదర్శి, మీసాల ప్రశాంత్ కుమార్, గణేష్ అభినందనలు తెలిపారు. అలాగే జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఈగ సంజీవ రెడ్డి, బొబ్బిలి నర్సయ్య, ఒలింపిక్ చైర్మన్ అంద్యాల లింగయ్య,బాస్కెట్ బాల్ రాష్ట్ర అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, బాజిరెడ్డి జగన్,ప్రవీణ్ రెడ్డి,భక్తవస్థలం, సాయగౌడ్,విజయ్ కాంత్ రావు, ఒమార్, రాజ గౌడ్, గోపిరెడ్డి, రాజగౌడ్, ప్రెసిడెన్సీ పాఠశాల పి ఈ టీ శ్రీనివాస్మరియు పలు క్రీడాసంఘాల బాద్యులు అభినందనలు తెలిపారు.