– జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో శుక్రవారం డివిజన్ ఉన్నత పాఠశాల లు, కేజీబీవీ మోడల్ పాఠశాలల ,గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు విధిగా నిర్వహించాల నీ బడి బయట పిల్లలను గుర్తించి వారికి “పని ప్రాంత పాఠశాలలు” ఏర్పాటు చేయాల నీ, సి గ్రేడ్ విద్యార్థుల ను ఏ గ్రేడు వచ్చేటట్లు కృషి చేయాల నీ అన్నారు. మార్చి 1 వ తేదీ నుండి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాల నీ విద్యార్థులకు లైబ్రేరి పీరియడ్ లో కథల పుస్తకాలు చదివించాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ వి ఎం సెక్టోరియల్క అధికారులు జి సి డి ఓ ,వనిత,,,శ్రీనివాస్, శ్రీధర్ మండల విద్యాధికారి రాజా గంగారాం,, శ్రీనివాస్ రెడ్డి ,మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.