నవతెలంగాణ-మియాపూర్
కన్నడ బుల్లితెర సినీ నటి శోభిత (32) ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శోభిత తన భర్తతో కలిసి శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీలోని సీ బ్లాక్‌లో నివాసం ఉంటున్నారు. భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. హఠాత్తుగా ఏం జరిగిందో తెలియదు కానీ ఆదివారం తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శోభిత ఆత్మహత్యకు ఎందుకు పాల్పడిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.