బీచ్‌లో వరుస హత్యలు..?

Serial murders on the beach..?వెన్నెల కిషోర్‌ టైటిల్‌ రోల్‌లో పోషిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’. రైటర్‌ మోహన్‌ రచన, దర్శకత్వం వహించారు. లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్‌ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సోమవారం ఈచిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. మేరీ అనే యువతి హత్య సంచలనంగా మారడంతో బీచ్‌లో జరిగే వరుస హత్యల చుట్టూ కథ తిరుగుతుంది. కేసును ఛేదించలేక, పోలీసులు క్రియేటివ్‌, కాలిక్యులేటివ్‌ ఎప్రోచ్‌తో పాపులరైన ఒక ప్రైవేట్‌ డిటెక్టీవ్‌ను నియమిస్తారు. డిటెక్టివ్‌ గ్రామంలోని ప్రేమజంటతో సహా అనుమానితులను ఏడుగురిని గుర్తిస్తాడు. రైటర్‌ మోహన్‌ కథను ఎంగేజింగ్‌, సస్పెన్స్‌గా ప్రజెంట్‌ చేశారు. వెన్నెల కిషోర్‌ టైటిల్‌ క్యారెక్టర్‌కు జీవం పోశాడు. ఈ చిత్రం ఈనెల 25న థియేటర్లలో విడుదల కానుంది. ‘క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు’ చిత్రాలతో విజయాలు అందుకున్న వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.