– రెండో టెస్టులో శ్రీలంకపై గెలుపు
పోర్ట్‌ఎలిజబెత్ : శ్రీలంకపై దక్షిణాఫ్రికా ప్రతీకార విజయం సాధించింది. రెండు టెస్టుల్లోనూ లంకేయులను ఓడించి సొంతగడ్డపై సత్తా చాటింది. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా మెరవటంతో రెండో టెస్టులో శ్రీలంకపై 109 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. 348 పరుగుల ఛేదనలో శ్రీలంక 238 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ ధనంజయ డిసిల్వ (50), కమిండు మెండిస్ (35), ఎంజెలో మాథ్యూస్ (32), దినేశ్ చండిమాల్ (29), కుశాల్ మెండిస్ (46) మెరిసినా.. శ్రీలంక గెలుపు గీతకు దూరంగానే ఉండిపోయింది. 69.1 ఓవర్లలో లంకేయుల కథ ముగిసింది. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ (5/76) ఐదు వికెట్ల మాయజాలం ప్రదర్శించాడు.