ఘోర రోడ్డుప్రమాదం..

–  బీఆర్‌ఎస్‌ మాజీ అధ్యక్షుడు,కొడుకు మతి
మెదక్‌ : మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నార్సింగి మండలం వల్లూరు జాతీయ రహదారిపై టైరు పేలిపోవడంతో అదుపుతప్పిన కారు.. డివైడర్‌ దాటి అవతలికి వెళ్లింది. దీంతో ఎదురుగా వస్తున్న లారీ దానిని ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో బీఆర్‌ఎస్‌ నార్సింగి మండలం మాజీ అధ్యక్షుడు తౌర్య నాయక్‌, ఆయన కుమారుడు అంకిత్‌ అక్కడికక్కడే మతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో క్రేన్‌ సహాయంతో బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్‌ దవాఖానకు తరలించారు. కాగా, తౌర్యా నాయక్‌ గతంలో నార్సింగి మండలం బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. అదేవిధంగా వ్యవసాయ ప్రాథమిక సహకారం సంఘం చైర్మన్‌గా, నర్సంపల్లి ఎంపీటీసీగా కూడా ఎన్నికయ్యారు. టైరు పగలడంతోనే కారు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.