సర్పంచుల సేవలు గుర్తుండిపోతాయి: ఎంపీటీసీ

నవతెలంగాణ – వలిగొండ రూరల్
గడిచిన ఐదేళ్ల పదవీ కాలంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చేసిన కృషి ఎనలేనివని వేములకొండ ఎంపీటీసీ  సామ రాంరెడ్డి అన్నారు. వారి పనితీరు చాలా బేషుగ్గా ఉందని కొనియాడారు. తన ఎంపిటిసి పరిధిలోని వేములకొండ,ముద్దాపురం,వెంకటాపురం, గుర్నాథ్ పల్లి నాలుగు గ్రామ పంచాయతీల సర్పంచుల, వార్డు మెంబర్ల  పదవీకాలం రేపటితో ముగిస్తున్నందున మంగళవారం అందరిని పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు.  పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు బోడ లక్ష్మమ్మ బాలయ్య,పెద్దిరెడ్డి ఉప్పల్ రెడ్డి,కొత్త నర్సింహా,జువ్వి మంజుల సత్తయ్య,మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ రసూల్,ఉపసర్పంచ్ కట్ట సత్తయ్య,ఆయా గ్రామపంచాయతీల వార్డు మెంబర్లు గ్రామ నాయకులు కెసిరెడ్డి జనార్దన్ రెడ్డి,పులిపలుపుల రాములు, ఎలగందుల అంజయ్య,ఇంజమూరి రామలక్ష్మయ్య,బొద్రబోయిన నర్సింహులు,బత్తుల అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.