
రాష్ట్రస్థాయిలో అబాకస్ లో ఐదవ స్థానంలో నిలిచిన శేరుపల్లి నైతిక్ ను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. దుబ్బాక సరస్వతి గ్లోబల్ స్కూల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అబాకస్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని పాఠశాల గౌరవ సభ్యులు లక్ష్మీనారాయణ, చింత నాగేందర్, నల్ల శ్రీనివాస్ మెడల్స్ అందజేసి అభినందించారు. ఇలానే ఉత్తమ ప్రతిభ కనబరిచి ముందుకు సాగాలని నల్ల శ్రీనివాస్ వెయ్యి రూపాయల నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు యాదగిరి, బాబా, హరీష్, కవిత, సంధ్య పలువురు పాల్గొన్నారు.