
పట్టణంలోని మామిడిపల్లి తపస్వి సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తరఫున, ఆక్స్‌ఫర్డ్ స్కూల్ విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ట్రస్టు నిర్వాహకులు బుధవారం తెలిపారు. స్నేహితుల నుంచి సేకరించిన పాకెట్ మనీని విరాళంగా ఇవ్వడం ద్వారా మీరు చూపించిన ప్రేమ, కరుణ, సామాజిక బాధ్యతాభావం అసాధారణం అని అన్నారు.. మీరు చేసిన ఈ మంచి పని మాకు స్ఫూర్తిగా నిలుస్తుంది అని, మా చిన్నారులకు తెచ్చిన చిరునవ్వులు, వారి జీవితాల్లో ఒక వెలుగు తెచ్చాయి అని, మీరు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తారని ఆశిస్తున్నామనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ,విద్యార్థులు పాల్గొన్నారు.