రాజకీయ పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు

Service programs beyond political parties– ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి
– సేవ చేయడంలో మానసిక సంతృప్తి కలుగుతుంది
– ఎస్ఆర్ఆర్ సంస్థల అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – రాయపర్తి
రాజకీయ పార్టీలకు, కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఎస్ఆర్ఆర్ సంస్థల అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం శ్రీ సీతా సుందర రామచంద్ర స్వామి  దేవాలయం ప్రాంగణం చుట్టూ ప్రహరీ గోడ, టైల్స్, కుర్చీల కోసం 30 లక్షల రూపాయలను విరాళం అందజేసి పనులను ప్రారంభించారు. తదుపరి 16 మందికి పైగా దివ్యాంగులకు ఉచిత బ్యాటరీ ట్రై సైకిల్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్ని సేవ కార్యక్రమాలు చేపట్టిన మండల ప్రజల సుఖ సంతోషాల కోసమే అని తెలిపారు. ఎంత సంపాదించినా అందులో కొంత పేద ప్రజలకు, వికలాంగులకు సేవ చేయడంలో ఎనలేని తృప్తి కలుగుతుందని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనాను అలవర్చుకొని ప్రశాంత జీవితాన్ని కొనసాగించాలన్నారు. శ్రీనివాస్ రెడ్డి సేవా కార్యక్రమాలు మరువలేని వాని పలువురు కొనియాడుతున్నారు. తదుపరి రాయపర్తి అంబేద్కర్ కాలనీలో గణపతి ఉత్సవంలో పాల్గొని ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలోమాజీ జడ్పీటీసీ రంగు కుమార్, లేతాకుల మధుకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పరుపాటి రాజిరెడ్డి, ఐరెడ్డి వెంకటరెడ్డి, సూరి, సుధాకర్, బిక్షపతి, కోలా అనిల్, గబ్బెట బాబు, గూడెల్లి వెంకటయ్య, బిక్షపతి, ఐత రాజు, పిరని ప్రవీణ్, ఐత  జంపి తదితరులు పాల్గొన్నారు.