– విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి పీఆర్టీయూ తెలంగాణ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం (2025-26) ప్రారంభం నాటికి సర్వీస్ రూల్స్ అమలయ్యే విధంగా ప్రతిపాదనలు రూపొందించాలని పీఆర్టీయూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంతోపాటు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహారెడ్డిని బుధవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ, వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్‌రెడ్డి కలిసి వినతిపత్రం సమర్పిం చారు. దానిపై సమీక్షించి ప్రతిపాదనలు తయారు చేస్తామంటూ వారు హామీ ఇచ్చా రని తెలిపారు. రూ.398 స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. సమగ్ర శిక్ష, కేజీబీవీ సిబ్బందికి మినిమం టైంస్కేల్‌ను ఇవ్వాలని పేర్కొన్నారు.