– ఎల్‌ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్ ఎల్‌కె శ్యాంసుందర్
– హైదరాబాద్ సైఫాబాద్ జోనల్ ఆఫీసులో ఘనంగా ఎల్‌ఐసీ 67వ వార్షికోత్సవం
హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) 67వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లోని జోనల్ ఆఫీస్ భవనంలో ఎల్‌ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ మేనేజర్ ఎల్‌కె శ్యాంసుందర్ లాంచనంగా ఎల్‌ఐసీ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ.. 1956 సెప్టెంబర్ 1న ఎల్‌ఐసీ ఆవిర్బవించిందన్నారు. సాంకేతికతను మెరుగుపర్చుకోవడంతో పాటుగా ఖాతాదారులకు అంచనాలకు మించి సేవలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ఐసీ అధికారులు జి మధు సూధన్, పి రమేష్ బాబు, ఆర్ సతీష్ బాబు, రాజేస్ భరద్వాజ్, ఉతుప్ జోసెఫ్, ఎంఎంపీ శ్రీనివాసరావు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.