కమ్యూనిస్టు భావాలను పునికి పుచ్చుకొని ఉద్యమ స్ఫూర్తితో ప్రజలకు సేవలు

– ఆలేరు మాజీ శాసనసభ్యులు డాక్టర్‌ కుడుదుల నగేష్‌
నవతెలంగాణ- ఆలేరుటౌన్‌
ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి, ధర్మ బిక్షం వంటి కమ్యూనిస్టు నేతల, ఆశయాలకు అనుగుణంగా కమ్యూనిస్టు భావాలను పునికి పుచ్చుకొని, ఆలేరు నియోజకవర్గంలో శాసనసభ్యునిగా ప్రజలకు సేవలందించానని ఆలేరు మాజీ శాసనసభ్యులు, యాదాద్రి భువనగిరి జిల్లా ఫ్లోర్‌ లీడర్‌ డాక్టర్‌ కుడుదుల నగేష్‌ పర్కొన్నారు. ప్రస్తుతం వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టనున్న వ్యూహం, ఆలేరు నియోజకవర్గం లో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యల గురించి గురువారం ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో మాజీ శాసన సభ్యునిగా అన్ని వర్గాలతో తనకి సంబంధాలు ఉన్నాయన్నారు. ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా తను పోటీ చేస్తానని, కాంగ్రెస్‌ పార్టీ విధానానికి కట్టుబడి ఉంటూ పనిచేస్తానని వివరించారు. గత 30 సంవత్సరాలుగా ఆలేరు నియోజకవర్గం లో రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉందని , తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలో పనిచేశానన్నారు. ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్‌ పోటీ చేసి గెలుపొంది, చట్టసభలో శాసనసభ్యునిగా ప్రజల కోసం పనిచేసి అనేక అభివృద్ధి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి, అభివృద్ధి అంటే నగేష్‌, నగేష్‌ అంటే అభివృద్ధి అనే విధంగా ఆలేరు నియోజకవర్గం లోని ప్రజలల్లో సుస్థిర స్థానం సంపాదించానన్నారు. ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలాదేవి తెలంగాణ సాయుధ పోరాట యోధుల వారసత్వం పునికి పుచ్చుకొని, కమ్యూనిస్టు బావాలు నిండుగా నింపుకొని , నక్సలైట్ల ఆలోచనలకు అనుగుణంగా, సీపీఐ(ఎం) ,సీపీఐ, సీపీిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ పార్టీల ఉద్యమ స్ఫూర్తిని పునికి పుచ్చుకొని అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ఆలేరు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యేగా తను పనిచేశానని వివరించారు. కమ్యూనిస్టుల ఎజెండాను అమలుపరచానన్నారు.కాంగ్రెస్‌ పార్టీలో రాచరిక వ్యవస్థ లేదని, ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని, ఆలేరు అసెంబ్లీ స్థానంలో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ ని నమ్ముకొని పనిచేస్తున్న వారు ఉన్నారని,టికెట్‌ ఆశించేవారు ఉంటారని తప్పు లేదని, ఎవరి సొంతం కాదని, కాంగ్రెస్‌ పార్టీ అందరిదని, పనిచేసే ప్రతీ కార్యకర్త ఎవరైనా టికెట్టు ఆశిస్తాడని, అరువుడని పోటీ చేసే అవకాశం ఉంటుందన్నారు. టికెట్‌ ఆశించడంలో తప్పు లేదన్నారు. బీఫామ్‌ ఎవరికి వస్తే వారే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధని పేర్కొన్నారు.తాను కాంగ్రెస్‌ పార్టీ వర్గం అన్నారు.ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా పనిచేస్తుందని, తిరిగి ఎమ్మెల్యేగా తను పోటీ చేస్తుందని , ధైర్యం ఉన్నవాళ్లే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, ఎవరి పార్టీ వారిదేనని అన్నారు. రాబేయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధిచెందుతుందని పేర్కొన్నారు.