హైదరాబాద్ : పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను అందించే సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ కొత్తగా వినూత్న సోలార్ సొల్యూషన్స్‌లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. సోలార్ ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్లు, సోలార్ హైబ్రిడ్ ఇన్వర్టర్లు, సోలార్ మైక్రో ఇన్వర్టర్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌లు తదితర వినూత్న సర్వీసులను అందిస్తున్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, నివాస, వాణిజ్య పైకప్పుల కోసం పిఎం కుసుమ్ స్కీమ్‌లకు అనుగుణంగా పరిష్కారాల మద్దతును ఇవ్వనుందని ఆ సంస్థ ఫౌండర్, ఎండి రామన్ భాటియా తెలిపారు. ఈ అత్యాధునిక పరిష్కారాలు స్వచ్ఛమైన ఇంధనం కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చనున్నాయన్నారు.