నీల పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించిన శేషు

నవతెలంగాణ –  రెంజల్

రెంజల్ మండలం నీలా జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ. శంకర్ కుమారుడు శేషు (ఐ ఆర్ ఎస్) శుక్రవారం 9, పదవ తరగతి విద్యార్థులకు గ్రూపు పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలనే విషయాలపై వారికి క్షుణ్ణంగా వివరించారు. డబుల్ ఐటి ఢిల్లీలో 2016 బ్యాచ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో విద్యనభ్యసించారు. యూపీఎస్సీ 2017_18 బ్యాచ్ లో 723 వ ర్యాంకును సాధించి( ఐ ఆర్ ఎస్) డిప్యూటీ కమిషనర్ ఆఫ్( జి.ఎస్.టి) ఇంటిలిజెన్స్ గా భువనేశ్వర్ ఒరిస్సాలో విధులను నిర్వహిస్తున్నారు. శుక్రవారం నీల పాఠశాలలో  విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించినందుకు పాఠశాల తరఫున ఉపాధ్యాయ బృందం వారికి కృతజ్ఞతలు తెలియజేసింది. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లావణ్య పదవ తరగతి కి చెందిన 80 మంది విద్యార్థినీ విద్యార్థులకు పౌచులతోపాటు, పెన్నులు పెన్సిల్లు ,రబ్బర్లు, వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అబ్బయ్య, శ్రీనివాస్, గులాం హైమాద్, ఆనంద్, అపర్ణ, గణేష్ కుమార్, స్వర్ణ, అనిల్, సిహెచ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.