
తెలంగాణ పండుగల్లో దశరా కు ప్రత్యేక స్థానం అయితే ఈ సందర్భంగా నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ సంస్క్రుతి సంప్రదాయాలకు తలమాణికం అని వి.కే.డి.వి.ఎస్ రాజు కళాశాల ప్రిన్సిపాల్ వెలుగోటి శేషుబాబు అన్నారు. ఈ కళాశాల విద్యార్ధినులు ఆద్వర్యంలో బుధవారం బతుకమ్మ ఉత్సవం నిర్వహించారు.అనంతరం జరిగిన సాంస్క్రుతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్ధినులు కు జ్ఞాపిక లను, ప్రశంసలు అందజేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.