మల్కాజిగిరి ఎంపీని కలిసిన సెస్ ఛైర్మన్..

నవతెలంగాణ – సిరిసిల్ల
దేశంలోనే విద్యుత్ సహకార సంఘాలు మూడు మాత్రమే ఉండగా వాటిలో ఒకటి తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్లలో ఉంది దీంట్లో భాగంగా సిరిసిల్లలో ఉన్న విద్యుత్ సహకార సంఘం జిల్లా మొత్తం కు విద్యుత్ సరఫరా చేస్తుంది. దీనికి సంబంధించిన సెస్ చైర్మన్ చిక్కాల రామారావు శుక్రవారం మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయమై చిక్కాల రామారావు తో మాట్లాడగా..  ఈటెల రాజేందర్ నాకు స్నేహితుడు బాగా అతను ఎంపీగా గెలుపొందడంతో అతన్ని కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగిందని, అంతేకాకుండా విద్యుత్ కు సంబంధించి పలు సమస్యలపై ఈటెల రాజేందర్ తో చర్చించడం జరిగిందని చిక్కాల రామారావు పేర్కొన్నారు.