ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు..

నవతెలంగాణ గీసుగొండ : వరంగల్ మహానర పరిధిలోని 16 వ డివిజన్ ధర్మారంలో గల ఎస్పీ బంక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కవిత సంతోష్ ల బృందం 300 మంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వారికి సంతోష్, డాక్టర్లు లక్ష్మణ్ ,శ్రీనాథ్ ,నవీన్ ,రమేష్ డిఎంఓ శాంతి స్వరూప్ మరియు బంకు సిబ్బంది పాల్గొన్నారు.