
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ ఏ.ఆర్.ఓ లను ఆదేశించారు. బుధవారం స్థానిక జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు జిల్లాలో 48 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నదని అట్టి కేంద్రాల్లో సంబంధిత ఏ.ఆర్.ఓ లు నిచ్చితంగా నిశ్చిమైన, ప్రాథమిక కనీస సౌకర్యాలు ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయా మండలాలు, మున్సిపాలిటీలలో సంబంధిత అధికారులు ఏర్పాట్లపై పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.