హిందూ వాహిని ధ్వజం స్తంభం ఏర్పాటు

నవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలం నీల గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన హిందూ వాహిని ధ్వజస్తంభం పెయింట్ వేస్తుండగా, ఒక వర్గం అభ్యంతరం తెలిపారు. ఇరు వర్గాల వారినీ బోధన్ ఎసిపి పిలిపించుకొని వాస్తవాలను పరిశీలించిన తర్వాత ధ్వజస్తంభం ఏర్పాటు చేసుకోవాలని తెలిపారని హిందు వాహి కార్యకర్తలు పేర్కొన్నారు. 2011లో అట్టి స్థలంలో ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరిగిందని వాస్తవాలను తెలుసుకున్న ఏసీపీ శాంతియుతంగా ఇరు వర్గాలకు మధ్య చెప్పారు. ఇలాంటి అల్లర్లు జరగకుండా శాంతియుతంగా ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన వారికి సూచించారు.