ఆన్‌లైన్‌ ద్వారా సీఎంపీఎఫ్‌ క్లెయిమ్స్‌ సెటిల్‌ మెంట్‌

– సింగరేణి పూర్తి సహకారం అందిస్తుంది
– సింగరేణి చైర్మెన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.బలరామ్‌
నవతెలంగాణ-కొత్తగూడెం
సీఎంపీఎఫ్‌ క్లెయిమ్స్‌ ఆన్‌లైన్‌ ద్వారా సెటిల్‌ మెంట్‌ చేయడానికి కావలసిన పూర్తి సమాచారం, సహకారం సింగరేణి సంస్థ అందిస్తుందని సింగరేణి చైర్మెన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.బలరామ్‌ తెలిపారు. బొగ్గు గని కార్మికుల సీఎంపీఎఫ్‌ క్లెయిమ్స్‌ ఇక ఆన్‌లైన్‌ ద్వారా సెటిల్‌ మెంట్‌ చేయుటకు గురించి సీ-డాక్‌ సంస్థ అభివృద్ధి చేసిన సీ-కేర్స్‌ పోర్టల్‌లో ఫైనాన్సియల్‌ మాడ్యూల్‌ రూపకల్పన చేయాలని సింగరేణి అధికారులు సిఎంపీఎఫ్‌ అధికారును కోరారు. ఈ మేరకు గురువారం కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీస్‌లో సింగరేణి సంస్థ చైర్మెన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ ఎన్‌.బలరామ్‌, ఛాంబర్‌లో చైర్మెన్‌ను అధికారులు మర్యాదపూర్వకముగా కలిసి సీఎంపీఎఫ్‌ క్లెయిమ్స్‌ ఆన్‌లైన్‌ ద్వారా పరిష్కారం జరుగుతున్న విధానాన్ని, ఫైనాన్సియల్‌ మాడ్యూల్‌ రూపకల్పన విధివిధానాలను వివరించారు. ఈ సందర్భంగా చైర్మెన్‌ బలరామ్‌ మాట్లాడారు. ఈ నూతన ఫైనాన్సియల్‌ మాడ్యూల్‌ రూపకల్పనలో సింగరేణి సంస్థ నుండి కావలసిన ఎలాంటి వివరాలనైనా సింగరేణి సంస్థ అందించగలదని ఎన్‌.బలరామ్‌ తెలిపారు. తొలుత బొగ్గు గని కార్మికుల సిఎంపిఎఫ్‌ క్లెయిమ్స్‌ను ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించే సీ-డాక్‌ సంస్థ అభివృద్ధి చేసిన సి-కెర్స్‌ పోర్టల్‌లో ఫైనాన్స్‌ మాడ్యూల్‌ రూపకల్పన చేయుటకు కోసం కావలసిన విధి విధానాలు గురించి సింగరేణి సంస్థ అధికారులు, సి-డాక్‌, సిఎంపిఎఫ్‌ ఉన్నతాధికారులతో సింగరేణి డైరక్టర్‌ (పా) ఆపరేషన్స్‌ ఎన్‌వికె.శ్రీనివాస్‌ మాట్లాడారు. బొగ్గు గని కార్మికుల, ఉద్యోగుల సిఎంపిఎఫ్‌ క్లెయిమ్స్‌ను త్వరగతిన సెటిల్‌ చేయుటకు కోల్‌ ఇండియా అనుబంధ సంస్థల అన్నింటిలో సి-డాక్‌ సంస్థ, బెంగుళూరు వారి ద్వారా అభివృద్ధి చేసిన సి-కేర్‌, పోర్టల్‌లో సింగరేణి ఉద్యోగుల జీతం నుండి రికవరీ అయిన సీఎంపీఎఫ్‌, పెన్షన్‌ పైకమును ఆన్‌లైన్‌లో నేరుగా సీఎంపీఎఫ్‌ లెడ్జర్‌ కార్డ్‌లో పోస్టింగ్‌ చేయటానికి వీలుగా ఫైనాన్షియల్‌ మాడ్యూల్‌ రూపొందించుటకు కావలసిన విధి విధానాలపై సుధీర్ఘముగా చర్చించారు. ఈ ఫైనాన్షియల్‌ మాడ్యూల్‌ రూపొందించుటకు కావలసిన వివరాలను సి-డాక్‌, సిఎంపిఎఫ్‌ ఉన్నతాధికారులకు, సింగరేణి అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో సి-డాక్‌ ఈడి ఎస్‌డి.సురర్షన్‌, సీఎంపిఎఫ్‌ రీజనల్‌ కమిషనర్‌ హరి పచౌరి, జనరల్‌ మేనేజర్‌(పర్సనల్‌) వెల్ఫేర్‌ అండ్‌ ఆర్‌సి కె.బసవయ్య, జిఎం (పర్సనల్‌) ఐఆర్‌ అండ్‌ పిఎం బి.హనుమంత రావు, జిఎం(ఐటి) జి.రామ్‌ కుమార్‌ రావు, జిఎం(ఎఫ్‌ అండ్‌ ఏ) ఎం.సుబ్బా రావు, సి-డాక్‌ జాయింట్‌ డైరక్టర్‌ మొహిత్‌ వేద్‌, ఎం.సిద్దార్ధ, సీఎంపిఎఫ్‌ఓ ఆసిస్టంట్‌ కమిషనర్‌ ఎం.కనకమ్మ, ఏజిఎం (పర్సనల్‌) కె.శ్రీనివాస రావు, ఏజిఎం (పర్సనల్‌) బెనెడిట్ట్‌ నికోలస్‌, డిజిఎం (ఐటి) హరి శంకర్‌, పర్సనల్‌ మేనేజర్‌ ముకుంద సత్యనారాయణ, ఫైనాన్స్‌ మేనేజర్‌ పి.రాజేశ్వర్‌, ఈఆర్‌పి అధికారులు వేణు గోపాల్‌, కె.ప్రవీణ్‌, వి.అనీల్‌ సి-కేర్స్‌ పోర్టల్‌ కో-ఆర్డినేటర్‌ సీతారాం, ఇతర అధికారులు, సీఎంపిఎఫ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.