దక్షిణ మధ్య రైల్వేకు ఏడు పురస్కారాలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జాతీయ స్థాయిలో ”అతి విశిష్ట రైలు సేవ పురస్కార్‌ 2023” విభాగంలో ఏడు అవార్డులను సాధించడం ద్వారా దక్షిణ మధ్య రైల్వే మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. కాజీపేట డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌ డీఎస్‌ రామారావు, సీనియర్‌ డివిజనల్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ సీఎచ్‌. దినేష్‌ రెడ్డి, సికింద్రాబాద్‌ డివిజనల్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ మల్లెల శ్రీకాంత్‌, డివిజనల్‌ సిగల్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజనీర్‌ి శివకుమార్‌ కశ్యప్‌, మహిళా సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ ప్రత్యూష, టికెట్‌ ఇన్స్‌పెక్టర్‌ టి.నటరాజన్‌, ట్రాక్‌ మెయింటెయినర్‌ వీ.రంగయ్యకు అవార్డులు లభించాయి. ఈ అవార్డులు డిసెంబర్‌ 15న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ చేతుల మీదుగా న్యూఢిల్లీలో అందజేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ అవార్డు గ్రహీతలందరినీ అభినందించారు.