కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏడుగురు బిఅర్ఎస్ కౌన్సిలర్లు..

– సాధారణంగా ఆహ్వానించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణ- మల్హర్ రావు
 మంథని మున్సిపాలిటీకు చెందిన ఏడుగురు బిఆర్ఎస్ కౌన్సిలర్లు  కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు.వారికి తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు.అనంతరం ఈ ఎదుగురితో పాటు, గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఇద్దరితో మొత్తం 9మంది కౌన్సిలర్లు మంథని  మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ, వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్ లపై అవిశ్వాసం నోటీసులు పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ జె.అరుణశ్రీకి  అందజేశారు.మంథని మున్సిపాలిటీ లో మొత్తం 13 మంది కౌన్సిలర్ల కు గాను ఇంత కాలం 11 మంది బిఅర్ఎస్. కౌన్సిలర్లు ఉండగా కాంగ్రెస్ పార్టీకి  ఇద్దరూ మాత్రమే కౌన్సిలర్లు ఉండగా గురువారం ఏడుగురు  కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లు సీపతి బానయ్య, వడ్లకొండ రవి, కుర్ర లింగయ్య, గుండా విజయలక్ష్మి పాపారావు, కొట్టే పద్మ రమేష్, వేముల లక్ష్మి సమ్మయ్య, నక్క నాగేంద్ర లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.