పసర పోలీస్ స్టేషన్ పరిధిలో 7 గురు వ్యక్తులను మంగళవారం బైండోవర్ చేసినట్లు పసర ఎస్ ఐ ఏ కమలాకర్ తెలిపారు. పసర పరిధిలో వన్యప్రాణులను వేటడటం కోసం ఎలక్ట్రిక్ తీగలు అమరుస్తున్నరన్న సమాచారం తో 7 గురు వ్యక్తులను పసర ఎస్ ఐ అదుపులోకి తీసికొని మండల తాహసిల్దార్ ముందు హాజరు పరిచి బైండోవేర్ చేయడమైనది. ఈ సందర్బంగా ఎస్ ఐ మాట్లాడుతూ బైండోవేర్ చేసిన వ్యక్తులు తిరిగి మళ్ళీ కరెంట్ తీగలు అమర్చితే కేసు నమోదు చేసి జైల్ కు పంపిస్తామని చెప్పటం జరిగింది.
బైండోవేర్ అయిన వారి వివరాలు:
1.వాసం శివాజీ , ప్రాజెక్ట్ నగర్2) జక్కు శంకర్, ప్రాజెక్ట్ నగర్,3)తల్లడి సోమయ్య, చల్వాయి.4)చేరుకుల వెంకటేశ్వర్ల, చల్వాయి. 5) జక్కు రాజు ప్రాజెక్ట్ నగర్. 6)పన్నలా అభిలాష్, దుంపెల్లిగూడెం,7) ఎర్రబోయిన కొమురయ్య దుంపెల్లిగూడెంలు ఉన్నారు.