ఏడుగురు పేకాట రాయుల్ల అరెస్టు

నవతెలంగాణ-కంటేశ్వర్
నగరంలోని ఒకటో పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయ్ బాబు ఆదివారం తెలిపారు. ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయ్ బాబు తెలిపిన వివరాల ప్రకారం..తేదీ 21. 5 .2023 రోజున అందాజా సాయంత్రం ఐదు గంటలకు నమ్మదగిన సమాచారం మేరకు డి విజయ్ బాబు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టౌన్ -1 వ పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి తిలక్ గార్డెన్ రోడ్ దగ్గర సిటీ లైన్ లాడ్జ్ నందు రూమ్ నెంబర్ 302 నందు పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తుల పేర్లను ఎస్హెచ్ఓ వెల్లడించారు. షేక్ సిరాజ్ ,మహమ్మద్ ఇర్ఫాన్,బిలాలుద్దీన్, షేక్ ఇసాక్, షేక్ సలీం, మహమ్మద్ రఫీక్, షేక్ నజీర్ అందరి నివాస స్థలం దుబ్బ నిజామాబాద్. అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 7400 నగదు 7 సెల్ ఫోన్స్ 4 మోటార్ సైకిల్ లను స్వాధీన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయ్ బాబు తెలిపారు.