ఏడుగురు పేకాట రాయుళ్ళ అరెస్ట్..

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ సుదీర్ రావు, టాస్క్ ఫోర్స్ అధికారులు కలిసి రైడ్ చేయగా ఏడుగురు పేకాట రాయుల్లను గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.  10,350 నగదు, ఐదు మొబైల్ ఫోన్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.