వరుసగా ఏడో ఓటమి

వరుసగా ఏడో ఓటమి– 2-4తో భారత్‌పై జర్మనీ గెలుపు
లండన్‌ (ఇంగ్లాండ్‌) : ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రొ లీగ్‌లో టీమ్‌ ఇండియా అమ్మాయిలు జర్మనీ చేతిలో వరుసగా ఏడో ఓటమి చవిచూశారు. శనివారం లండన్‌లో జరిగిన మ్యాచ్‌లో జర్మనీ 4-2తో భారత్‌పై గెలుపొందింది. తొలి క్వార్టర్‌లో సునెలిట (9వ నిమిషం), దీపిక (15వ నిమిషం) గోల్స్‌ కొట్టి భారత్‌ను 2-0తో ముందంజలో నిలిపారు. కానీ జర్మనీ ఎంతో సేపు ఆగలేదు. విక్టోరియా వరుసగా పెనాల్టీ కార్నర్‌లను (23, 32వ నిమిషం) గోల్స్‌గా మలిచి స్కోరు సమం చేసింది. స్టినె, జులె సైతం గోల్స్‌ కొట్టగా జర్మనీ 4-2తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. ప్రొ లీగ్‌ చివరి మ్యాచ్‌లో గ్రేట్‌ బ్రిటన్‌తో భారత అమ్మాయిలు ఆడనున్నారు.