హైదరాబాద్ : రిటైల్ ఉత్పత్తుల విక్రయ చెయిన్ నేషనల్ మార్ట్ హైదరాబాద్‌లో తన 7వ స్టోర్‌ను తెరిచింది. మెహదీపట్నంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను శనివారం ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లాంచనంగా ప్రారంభించారు. ఈ స్టోర్‌లో కిరాణా, స్టేషనరీ, గృహ అండ్ కిచెన్ అప్లయెన్సెస్, కుక్ వేర్, పాదరక్షలు, పురుషులు, మహిళలు, పిల్లల కోసం దుస్తులు ఇంకా మరెన్నో ఉత్పత్తులను సరసమైన ధరలకే లభిస్తాయని నేషనల్ మార్ట్ వ్యవస్థాపకుడు యశ్ అగర్వాల్ తెలిపారు. నాణ్యత, చౌకగా ఉండే బ్రాండ్ మిశ్రమాన్ని మెహిదీపట్నానికి తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.