రాజీనామ యోచనలో పలువురు బీఆర్ఎస్ నాయకులు..?

– అసంతృప్తితో రాజీనామ బాట పడుతున్నట్టు వెల్లడి 

నవతెలంగాణ-బెజ్జంకి 
అసంతృప్తితో పలువురు బీఆర్ఎస్ నాయకులు రాజీనామ యోచనలో ఉన్నట్టు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బుధవారం తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం శాయశక్తుల కృషి చేశామని..ఎన్నికల అనంతరం మండల బీఆర్ఎస్ నాయకత్వం మహిళ సర్పంచులను,నాయకులను విస్మరించారని.. దీంతో అసంతృప్తికి గురై రాజీనామ బాట పడుతున్నట్టు బీఆర్ఎస్ నాయకుడు వెల్లడించారు.