బాధిత కుటుంబాలకు పలువురు సోమవారం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మండల కేంద్రానికి చెందిన కటికే సంతోష్ మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి రూ.3000 ఆర్థిక సహాయాన్ని అభయ హస్తం సిండికేట్ ద్వారా సభ్యులు అందజేశారు. పోసానిపేట గ్రామానికి చెందిన తాడువాయి లక్ష్మణ్ ప్రమాదంలో గాయపడి కాలుకు ఆపరేషన్ నిర్వహించగా, తోటి మిత్రుడు ఆపదలో ఉండడమే తెలుసుకొని పదవ తరగతి 2005-06 కు చెందిన మిత్రులు బాధితుడికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో ప్రస్తుత సభ్యులతో పటు, తోటి మిత్రులు పాల్గొన్నారు.