నవతెలంగాణ – నూతనకల్
కల్లుగీత కార్మికునికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని వెంకే పెళ్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన తోణుకునూరి లక్ష్మయ్య వృత్తి రీత్యా గీతా కార్మికుడు థిరసరి చర్యలో భాగంగా సాయంత్రం తాడిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి తాడిచెట్టు పైనుండి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇట్టి విషయం తెలుసుకున్న స్థానికులు అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడం తో 108 లో జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ కి తరలించినట్లు తెలిపారు అతనికి కాలు విరిగి ఆరోగ్య పరిస్థితి విషమయాలు ఉన్నట్లు పేర్కొన్నారు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బత్తుల జనార్ధన్ గౌడ్ బాధితుని పరామర్శించి అతనికి వెంటనే ప్రభుత్వం ద్వారా వచ్చే ఎక్స్గ్రేస్య 10 లక్షల రూపాయలు , బీసీ కార్పొరేషన్ ద్వారా తక్షణ సహాయం కింద 25 వేల రూపాయలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.