– ఉపాధ్యాయుడు, విద్యార్థులపై కోతుల దాడి
– కోతుల సంచారంతో పాఠశాల సిబ్బంది బెంబేలు
నవతెలంగాణ – బెజ్జంకి
కిటికిలో చిక్కుకున్న కోతిని రక్షించడానికిపోతే మరో కోతి వచ్చి ఉపాధ్యాయుడిని తీవ్రంగా గాయపరిచిన సంఘటన మండల కేంద్రంలోని బాలికల ప్రభుత్వోన్నత పాఠశాలలో బుధవారం జరిగింది. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల మేరకు బాలికల ప్రభుత్వోన్నత పాఠశాల అవరణంలోకి కోతుల గుంపు ప్రవేశించింది. గుంపులోని కోతి కిటికిలో చిక్కుకోవడంతో రక్షించడానికి ప్రయత్నించిన ఉపాధ్యాయుడు సురేశ్ బాబుపై మరో కోతి దాడి చేసింది. దీంతో ఉపాధ్యాయుడిక వీపుపై గాయమై తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన పాఠశాల సిబ్బంది విద్యార్థుల సహయంతో స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా వైద్యురాలు నజీమ్ ఉన్నీసా తహసీన్ బాధితుడిని పరిక్షించి చికిత్స అందించారు. మరో ఇద్దరు విద్యార్థులపై కోతులు దాడి చేయగా పదవ తరగతి చదువుతున్న మణిదీపుకు స్వల్ప గాయాలైయ్యాయి. కోతులు దాడి చేయడంతో పాఠశాలలో భయానక వాతావరణం నెలకొంది.అధికారులు స్పందించి కోతుల నివారణకు సత్వర చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వేడుకున్నారు.
రక్షించడానికిపోతే..తీవ్ర గాయం..
కోతుల బేడదతో బెంబేలు: పదవ తరగతి విద్యార్థులకు ఉదయం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాము.సమయపాలన పాటించి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకూ పాఠశాలకు ముందస్తుగా వచ్చిన కోతుల బెడదవల్ల పాఠశాల అవరణంలోకి బోధన సిబ్బంది వెళ్లడానికి బెంబేలేత్తిపోతున్నారు.కోతుల సముహం పాఠశాల అవరణం విడిచీ వెళ్లే వరకు వేచిచూస్తుండడంతో సమయం వృథావుతోంది.దీంతో కోతుల బేడద సమస్య తీవ్రత ఉదృతమవ్వడంతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్యాంశాలు భోదించలేని దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కోతుల నివారణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి.
-బాలికల ప్రభుత్వోన్నత పాఠశాల బోధన సిబ్బంది,బెజ్జంకి