వేములవాడ పట్టణంలోని తన వార్డులో సమస్య రాగానే స్పందించి దగ్గరుండి మరి మున్సిపల్ సిబ్బందితో మురుగు నీటిని తొలగించి తన బాధ్యతను నిర్వర్తిస్తున్న 27వవార్డు కౌన్సిలర్ గోలి మహేష్, గురువారం రాత్రి కురిసిన వర్షానికి వరద నీరు మురుగు కాలువలోకి చేరడంతో రోడ్డుపైకి మురుగునీరు భారీగా చేరి అక్కడున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడడంతో శుక్రవారం వెంటనే స్పందించిన కౌన్సిలర్ గోలి మహేష్ మున్సిపల్ జవాన్ ఐతం మహేష్, మున్సిపల్ సిబ్బంది సహాయంతో వెంటనే మురుగునీరు తొలగించారు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు, వేములవాడ పట్టణ ప్రజలు కౌన్సిలర్ మహేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.