
మద్నూర్ మండలంలోని గోజేగావ్ గ్రామంలో గురువారం నాడు సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఆ గ్రామ పెద్దలు మాజీ మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శివాజీ రాథోడ్ ఆ గ్రామ తాజా మాజీ సర్పంచ్ అనిత ఈరావంతు దేశ్ముఖ్ ఆధ్వర్యంలో అంగారంగా వైభోగంగా ఉత్సవంగా ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సేవాలాల్ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సేవాలాల్ జాతి కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.