– త్వరలో నూతన కమిటీ ఏర్పాటు..
– భూక్యా సంజీవ్ నాయక్
నవతెలంగాణ-ముషీరాబాద్
సేవాలాల్ సేనా రాష్ట్ర కమిటీని సోమవారం సుందర య్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కమిటీ సమావేశంలో రద్దు చేశారు. త్వరలో నూతన కమిటీని ఎన్నుకోనున్నట్లు సేవా లాల్ సేనా వ్యవస్థాపక అధ్యక్షులు భూక్యా సంజీవ నాయక్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. గిరిజనులు తెలంగాణ రాష్ట్రంలో కోట్లాడి సాధించుకున్న పది శాతం రిజర్వేషను కొనసాగించాలని అందుకోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. కావాలని కొంత మంది స్వార్థ పరులు గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు దక్కకుండా హైకోర్టులో రీపిటిషన్ వేశారన్నారు. జీవో నెంబర్ 33 ద్వారా గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ అమలు చేస్తే హైకోర్టులో పిటిషన్ వేయడం ద్వారా గతంలో ఉన్న రిజర్వేషన్ కొనసాగించాలని హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో లంబాడీల కు మంత్రి పదవి ఇవ్వకుండా తాత్సారం చేయ డం తగదని వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజేన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 33 ద్వారా వంద శాతం ఉద్యోగాలను ఏజెన్సీ వారికి ఇవ్వాలని ఆర్డర్ ఉన్నప్ప టికి దీన్ని సవాల్ చేస్తూ కొంత మంది స్వార్థ పరులు సుప్రీం కోర్టును ఆశ్రయించారని దాన్ని కూడా కొట్టివేశారన్నారు. గిరిజనుల హక్కులను సాధించేందుకు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ రాష్ట్ర కమిటీ సమావేశంలో కోర్ కమిటీ చైర్మెన్ ధారావత్ ప్రేమ్‌చంద్‌్, రాష్ట్ర ఇన్‌చార్జీ మాలోతు సైదానాయక్, రాష్ట్ర అధ్యక్షులు రాంబాబునాయక్, రైతు సంఘం అధ్యక్షులు భానోతు కిష న్‌నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ రఘురామ్ రాథోడ్, గ్రేట ర్ అధ్యక్షులు కళ్యాణ్‌నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దారావత్ వెంకన్న, లకావత్ భాస్కర్, ఉపాధ్యక్షులు రేఖ్యానాయక్, పరశురామ్ నాయక్, బాలు నాయక్, మోతీలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.