మానసిక వికలాంగురాలుపై లైంగికదాడి..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
మానసిక వికలాంగులు పై లైంగికదాడి జరిగిన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సామాజిక కార్యకర్త బుధవారం  భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వివరాలను పరిశీలిస్తే భువనగిరి మండలంలో చందు పట్ల గ్రామం లో మానసిక వికలాంగురాలైన యువతిపై అత్యాచారం జరిగినట్లు బందువుల ఆరోపణ లు ఉండగా, అత్యాచారం చేసినవాడు సమీప బందువే నని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా గతంలో కూడా అతనిపై లైంగిక ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.  మద్యం మత్తులో దారుణం జరిగినట్టు తెలుస్తోందని, మంగళవారం మధ్యాహ్నం బాధితురాలికి చెందిన బందువులు 100 పోన్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి,బాధితురాలికి న్యాయం చేయాలని కోరిన సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ కోరారు.